మీరు ఇతరులకు మంచి చేసేవారా? అయినా కొన్ని ఆర్థిక, మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా.?అయితే ఇలా చేయండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు

కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్తున్నారు. అలంటి శక్తులను పారద్రోలి సానుకూల పరిస్థితులను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఉప్పుకే ఉంది.

అదేలా అంటే.. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేయాలి. ఆ బాల్ ను స్నానపుగది లో పైభాగంలో నీరు పడకుండా ఉంచాలి.

ఆ ఉప్పు కరిగిన తరువాత మల్లి ఉప్పుతో నింపి ఉంచితే  ఇంటికి దృష్టి లోపాలు ఉండవు.. దారిద్య్రం తొలగుతుంది. అంతేగాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో పసుపు,రాళ్ల ఉప్పు  వేసి శుభ్రం చేయాలి.

ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి వుంటుంది. ఇకపోతే. ధనాన్ని వుంచే పర్సుల్లో చిటికెడు రాళ్ల పేపర్లో మడతపెట్టి వుంచితే ఆర్దిక ఇబ్బందులు ఏమాత్రం వుండవు.

ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే,విభేదాలు తొలగిపోవాలంటే ఫై అలమరాల్లో రాళ్ల ఉప్పును నింపిన బౌల్‌ను వుంచి..

వారానికి ఓసారి శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా కూడ మంచి జరుగుతుంది. అలాగే రోజు వాహనాలు కడిగే నీళ్లలో కూడా ఉప్పు వేస్తె ప్రతికూల శక్తులనుండి తప్పించుకోవచ్చు.