బంగాళదుంప తొక్కతీసి రసం తీసుకోవాలి.
ఇందులో ఒక నిమ్మ రసం , 2 స్పూన్ల బియ్యపిండి, అర స్పూన్ రోజ్ వాటర్ కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో గడ్డకట్టనివ్వాలి.
ఉదయాన్నే ముఖానికి టొమాటో రుద్ది నీటితో కడిగేయాలి.
తర్వాత గడ్డకట్టిన క్యూబ్స్ తో ముఖానికి రుద్దుకోవాలి.
ఇలా వారంపాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమల వాళ్ళ వచ్చిన మచ్చలు తొలగిపోతాయి.