శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు ప్రోటీన్లు చాలా అవసరం.

అందుకోసం ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ ఆహారాలను తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

రోజుకు కనీసం ఒక గ్లాస్ పాలు తాగితే శరీరంలో ప్రోటీన్ లోపం సమస్య ఉండదు.

గుడ్లలో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోజూ గుడ్లు తినడం మంచిది.

చికెన్, చేప వంటి వాటిలో ప్రోటీన్లు కావలసినంతగా సమృద్ధిపాళ్లలో ఉంటాయి.

సోయ పాలను తీసుకోవడం వల్ల కూడా ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

చీజ్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

పప్పులో ప్రోటీన్లు, ఫైబర్లు మాత్రమే కాక పలు రకాల మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

 ప్రోటీన్ల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకోవడం కూడా చాలా ఉత్తమం. వాల్‌నట్స్, బాదం, పిస్తా పప్పులలో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.