‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో  రామ్‌చరణ్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే

ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా కియారా అడ్వాణీ కథానాయిక నటిస్తున్నారు

ఈ చిత్రంలో శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు

ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై RC15 వర్కింగ్ టైటిల్ తో దిల్‌రాజు నిర్మిస్తున్నారు

కాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం

ఈ చిత్రానికి ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్

ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది