తయారు చేయవలసిన పదార్థాలన్నీ ఒక దగ్గర ఉంచుకున్న తర్వాత గ్యాస్‌ను వెలిగించాలి

ఫ్రిజ్‌లోని వస్తువులను బయటకు తీసిన 15 నుండి 30 నిమిషాలు తర్వాత వేడి చేయండి

ఆహారం ఉడుకుతున్నప్పుడు మూత పెట్టాలి. ఇది ఆహారాన్ని వేగంగా ఉడికించడంతోపాటు గ్యాస్‌ను ఆదా చేస్తుంది

ప్రెషర్ కుక్కర్‌లో ఆహారాన్ని వండడానికి తక్కువ సమయంతోపాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది

ఒకసారి నీటిని మరిగించి థర్మోస్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ బాగా ఆదా చేస్తుంది

గ్యాస్ లేదా గ్యాస్ పైపు లీకేజీలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయండి. పైపులు లీక్ కావడం వల్ల గ్యాస్ త్వరగా అయిపోతుందని కూడా గుర్తుంచుకోవాలి

పాడైపోయిన లేదా కాలిన పాత్రలో ఆహారాన్ని వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల వంట చేసే గిన్నెను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి

గ్యాస్ మంట రంగు ఎల్లప్పుడూ నీలం రంగులో ఉండాలి. రంగు మారితే, శుభ్రం చేసుకోవడం మంచిది