బొద్దింకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా ఉపయోగపడుతోంది.
బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీటిలో బాగా కలిపి అలాగే దానిలో కాస్త చక్కెర కలపాలి.
ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేస్తే బొద్దింకలు పారిపోతాయి.
అలాగే కిరోసిన్ సహాయంతో బొద్దింకల బెడదను వదిలించుకోవచ్చు. దాని వాసన నుండి పారిపోతాయి.
పలావ్ ఆకును మెత్తగా రుబ్బుకోవాలి.
దీని తర్వాత ఈ పొడిని ఇంట్లోని ప్రతి మూలలో కొద్దికొద్దిగా చల్లుకోండి దాంతో బోదింకలు పారిపోతాయి.
అదేవిధంగా ఒక గ్లాసు నీటిలో సగం గ్లాసు పిప్పరమెంటు నూనె కలపండి.
తర్వాత దానికి కాస్త ఉప్పు వేసి స్ప్రే బాటిల్ లో నింపి ఇంట్లో స్ప్రే చేసుకోవాలి.
అలాగే లవంగాల పొడిని తయారు చేసి, బొద్దింకలు కనిపించే ప్రదేశాలలో ఉంచాలి.
లవంగాలను నీటిలో మరిగించి బొద్దింకలు కనిపించిన ప్లేస్ లో చల్లుకోవాలి.