చలికాలంలో పాదాలకు పగుళ్లు రావడం సర్వసాధారణం

అయితే ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే పగుళ్లు పోయి చర్మం మృదువుగా, అందంగా కనిపిస్తుంది

పావు కప్పుకొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె కలిపి రాత్రి నిద్రపోయేముందు పాదాలకు రాసి బాగా మసాజ్ చేయండి

రోజూ ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి నొప్పులు తగ్గుతాయి, పాదాలకు పగుళ్లు కూడా రావు

రెండు చెంచాల పెసరపిండి, కాస్త పెరుగు, నువ్వుల నూనె మిక్స్ చేసి పాదాలకు బాగా రాయండి

బ్రష్‌తో మరోసారి రాస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా ఉంటుంది

కొన్ని గులాబీ రేకలు, రెండు తులసి రెమ్మలు, చెంచా ఆలివ్‌ నూనె నీళ్లల్లో వేసి గోరువెచ్చగా మరిగించి కాసేపు అందులో పాదాలను ఉంచండి

తర్వాత ప్యూమిక్‌ స్టోన్‌తో రుద్దితే మృతచర్మం పోయి కోమలంగా మారుతుంది