టాన్సిల్స్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పుడు ఉప్పు నీటిని పుకిలించాలి. ఇందుకోసం గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి పుకిలించాలి

ఇలా రోజుకు రెండు మూడు సార్లు ఉప్పు నీటితో పుకిలిస్తే కొద్ది రోజుల్లో టాన్సిల్స్ సమస్య.. వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది

టాన్సిల్స్ నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందడానికి పాలు, తేనె కలిపి తీసుకోవాలి

రోజూ రాత్రి పడుకునే ముందు గొరువెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది

టాన్సిల్స్ సమస్యను తగ్గించుకోవడానికి పసుపు, నల్ల మిరియాల పాలు కూడా ఉపయోగపడతాయి

ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలను వేడి చేసి అందులో కొద్దిగా పసుపు, ఎండుమిర్చి లేదా నల్ల మిరియాల పొడి వేసి తీసుకోవాలి

ఇలా చేయడం వలన టాన్సిల్స్ నొప్పి, వాపు సమస్య తగ్గుతుంది