లంచ్ తర్వాత నిద్ర వస్తుంది.. కావున కొంతమంది లంచ్ మానేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు
భోజనం తర్వాత వెంటనే పని ప్రారంభించకుండా 15-20 నిమిషాలు ఆఫీసు కారిడార్‌లో నడవండి. కనీసం మెట్లయినా ఎక్కి దిగండి
ఇలా చేయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. దీంతోపాటు శక్తి కూడా లభిస్తుంది
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలి. వీలైనంత ఎక్కువ నీరు, ద్రవ ఆహారం తీసుకోండి
మధ్యాహ్న సమయంలో తేలికగా భోజనం చేయండి. మితిమీరిన భోజనం జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
మధ్యాహ్న భోజనంలో ఐరన్, ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి
తక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలు తినండి. మధ్యాహ్న భోజనం తరువాత స్వీట్లకు బదులు ఒక పండు తినండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. కూరగాయలు, చేపలు-గుడ్లు లేదా తృణధాన్యాలు తీసుకోండి
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య భోజనం చేయండి. ఆలస్యంగా చేస్తే అలసట పెరుగుతుంది.