కొద్దిగా పాలను తీసుకుని 1 గంట పాటు సన్నని మంటపై మరిగించాలి. దీంతో పాల కోవా తయారవుతుంది.
అయితే అది నూనె తరహాలో ఉంటే పాలలో కల్తీ జరగలేదని అర్థం. అలా కాకుండా గట్టిగా ఉంటే మాత్రం ఆ పాలు కల్తీ అయ్యాయని గుర్తించాలి.
కృత్రిమ పాలను సబ్బులు, సహజసిద్ధమైన పాలను కలిపి తయారు చేస్తారు.
అందువల్ల ఆ పాల రుచి తేడా ఉంటుంది. అలాగే వాటిని వేడి చేస్తే ఆ పాలు పసుపు రంగులోకి మారుతాయి.
పాలలో నీళ్లు కలిపారా లేదా అనే విషయాన్ని కూడా సులభంగానే గుర్తించవచ్చు.
ఒక పాల చుక్కను అర చేతిలో వేసి ఆ చుక్క కిందకు ప్రవహించేలా చేయాలి.
ఆ చుక్క వెనుక ధారలా ఏర్పడితే ఆ పాలలో నీళ్లు కలిపారని అర్థం. అలా జరగకపోతే ఆ పాలు స్వచ్ఛమైనవిగా భావించాలి.
పాలలో పిండి కలిపినా గుర్తించవచ్చు. పాలను 5మి.లీ మోతాదులో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల అయోడైజ్డ్ సాల్ట్‌ను వేయాలి.
తరువాత పాలు నీలి రంగులోకి మారితే ఆ పాలు స్వచ్ఛంగా లేవని తెలుసుకోవాలి.