బట్టల పై టీ మరకలు తొలగించే చిట్కాలు

టీ మరకలు పడిన చోట చెంచా బేకింగ్ సోడా వేసి నెమ్మదిగా రుద్దాలి. కాసేపయ్యాక ఉతికితే మచ్చ తొలగిపోతుంది.

టీ మరక పడిన చోట మనం వాడే టూత్ పేస్ట్ పూసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో ఉతికితే ఫలితముంటుంది.

కాస్త లిక్విడ్ డిటర్జెంటును బట్టపై టీ మారక పడినచోట వేసి వేళ్ళతో కాసేపు రుద్దాలి. కొద్దీ సేపు ఉంచి నీటితో శుభ్రం చేస్తే మరక పోతుంది.