నిద్ర లేవగానే వంట త్వరగా చేసెయ్యాలంటే తరిగిన కూరగాయలు, అల్లం, ఉల్లి, వెల్లుల్లి పేస్ట్, ఇతర మసాలలను ముందుగానే రెడీగా ఉంచుకోవాలి
వంట పని చిటికెలో చెయ్యాలంటే ముందు రోజు రాత్రి అవసరమైన కూరగాయలను ముక్కలుగా చేసుకుని ఫ్రిజ్‌లో దాచుకుంటారు
ఐతే ఉల్లిపాయల విషయంలో ఈ చిట్కా ఫలించదు
ఎందుకంటే తరగిన ఉల్లి ముక్కలు త్వరగా పాడైపోయి, వాసన వస్తాయి
మరెలా.. అని అనుకుంటున్నారా? ఇంట్లోనే ఉల్లిపాయ పౌడర్ తయారు చేసుకుంటే సరి
ముందుగా ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరుగుకోవాలి. తర్వాత మైక్రోవేవ్‌లో150 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద 40 నిమిషాలపాటు ఉంచాలి
ఆ తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. ఉల్లి ముక్కల్లో నీరు లేకుండా పొడిబారే వరకు ఎండబెట్టుకోవాలి
ఎండిన ఉల్లి ముక్కలను చేత్తో నలిపి మిక్సిలో కూడా పొడి చూసుకొంటే చాలా కాలం నిల్వ ఉంటుంది