భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న తగాదాలే.. పెద్దవిగా మారి.. క్షణికావేశంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

అయితే భార్యల వద్ద భర్తలు ఈ విషయాలు పాటిస్తే మీ అంత గొప్ప భర్త ఉండదు అనే చెప్పాలి.. కావాలంటే మీరే చూడండి..

ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి.

ఆవిడ సమస్యలు చెబుతున్నప్పుడు పేపర్‌ చదవడం , మొబైల్‌ చూడటం ఆపండి,

ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి.

ఆమె పుట్టిన రోజును గుర్తు పెట్టుకొని గ్రీట్‌ చేయండి..

పిల్లలకన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి..

ఆమె మూడ్‌ బాగా లేనప్పుడు ఏమి జరిగిందని అడగండి

ఆమెతో బయటికి వెళ్లినప్పుడు దిక్కులు చూడకండి.