ఊబకాయం వల్ల చాలామంది రకరకాల వ్యాధులకి గురవుతారు. దీంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది

మీరు బరువు తగ్గాలనుకుంటే ముందుగా అల్పాహారంతో ప్రారంభించాలి

ప్రజలు ఆలోచించకుండా ఉదయాన్నే పూరీలు, పరాటాలు, నామ్‌కీన్, బిస్కెట్లు వంటివి తీసుకుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదు

ఎందుకంటే మీరు ఏది తిన్నా అది మీ బరువుపై ప్రభావం చూపుతుంది

నిద్రలేచిన తర్వాత మీరు 40 నుంచి 60 నిమిషాలలోపు బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి. మీరు దీనికి ముందు గింజలు లేదా పాలు తీసుకుంటే రెండు గంటల గ్యాప్ తీసుకోవచ్చు

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారని కొందరు అనుకుంటారు.ఇది బరువు తగ్గడానికి బదులుగా పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ని దాటవేయవద్దు

కొంతమంది ఉదయంపూట గుడ్లు మాత్రమే తింటారు. అందులో గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. పచ్చసొనను వదిలివేస్తారు. ఇలా చేయడం సరికాదు

మీ రోజును చక్కగా ప్రారంభించడానికి మీ జీవక్రియ రేటు బాగుండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, పిండి పదార్థాలు, మంచి కొవ్వును చేర్చుకోవడం ముఖ్యం