తరతరాల నుంచి దేశీ నెయ్యి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేరు

ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి మేలు చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

ఈ కారణంగా ఆరోగ్య నిపుణులు సైతం దీనిని తినాలని కూడా సిఫార్సు చేస్తున్నారు

ఇందులో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఎ, కె, ఇ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

కొన్ని రకాల వ్యాధులు ఉన్న వారు నెయ్యిని తీసుకోకూడదని చెబుతున్నారు. మరి ఎవరు నెయ్యి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం

గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు నెయ్యిని తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జలుబు, దగ్గు సమస్య ఉన్న సమయంలో నెయ్యి తినడం వల్ల గొంతులో సమస్య మరింత పెరుగుతుంది. దగ్గు తీవ్రత పెరుగుతుంది

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలేయం ఆరోగ్యం సరిగ్గా లేకుంటే నూనె గానీ, నెయ్యి పదార్థాలు కానీ తినకూడదు