మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరో‌క్విన్, అజిత్రోమైసిన్‌ ఔషధాల వల్ల గుండె పోటుతో పాటు మరణాల ముప్పు ఎక్కువని ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది

విడిగా లేదా హెచ్‌‌సీక్యూ-అజిత్రోమైసిన్ కలిపి వాడటం వల్ల దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది

దీర్ఘకాలం హెచ్‌సీక్యూ – అజిత్రోమైసిన్ వాడకం వల్ల గుండె సంబంధ మరణాల ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది

వీటి వల్ల 15-20 శాతం మందిలో ఛాతీ నొప్పి, గుండె పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి

మలేరియా, చర్మ సంబంధ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటీస్ చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సాధారణంగా వాడతారు

ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు