దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని రహస్యాలు, ఎన్నో అద్భుతాలు, మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి
ఛార్‌ధామ్ వంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లోకి ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే భక్తులను అనుమతిస్తారు
ప్రస్తుతం అలాంటి ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం
ఛత్తీస్‌గఢ్‌లోని నిరయ్ మాతా ఆలయాన్ని ఏడాదిలో కేవలం 5 గంటలే గంటలే తెరుస్తారట
గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఈ దేవాలయం ఉంటుంది
ప్రతి ఏడాది ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు
మళ్లీ వచ్చే ఏడాది ఛైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు