మన జీవనాధారం వంటి సహజ వనరుల పట్ల మనకున్న భక్తిని తెలియజేస్తూ భారతదేశంలో ముఖ్యంగా హిందువులు మొక్కలను, మూలికలను దేవుడిగా పూజిస్తారు
చెట్లు మనకు నీడ, పండ్లు, కూరగాయలు, నూనెలు, కలప వంటి మన మనుగడకు చాలా ముఖ్యమైన అనేక వస్తువులను అందిస్తాయి
ఔషధ ప్రయోజనాలున్న దేవకాంచన మొక్క ఆయుర్వేద చికిత్సలలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్న మూలికల మొక్క
ఈరోజు ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం
ఈ చెట్టు పువ్వులను సేకరించి ఎండబెట్టి దంచి పొడి చేసి సమాన మోతాదులో పటిక బెల్లం కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసి రోజుకు రెండుసార్లు అరచెంచా తీసుకుంటే మొలలు తగ్గుతాయి
హార్మోన్లు సరిగాలేని వారు ఈ చెట్టు బెరడుని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి తర్వాత ఈ నీటిలో పటిక బెల్లం వేసుకుని ఆ నీటిని తాగితే హార్మోన్లు సమతుల్యం అవుతాయి
ఈ చెట్టు బెరడు పొడిని గ్లాసు నీటిలో వేసి.. బాగా మరిగించి.. తర్వాత ఆ నీటిని వడబోసుకుని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే.. వెంటనే నోటిపూత తగ్గుతుంది
ఈ చెట్టు బెరడు కషాయం 10-20 గ్రాములు రోజుకు రెండుసార్లు తాగితే కాలేయం వాపును నయం చేస్తుంది