టాప్‌ డైరెక్టర్లు అందరూ ప్రకాష్‌ రాజ్‌ వి వాళ్ల సినిమాల్లో తీసుకున్నారు.

అలాంటిది రాజమౌళి మాత్రం విక్రమార్కుడు సినిమాలో ఒక చిన్న పాత్ర..

5 నిమిషాల పాటు స్ర్కీన్‌ మీద కనపడే పాత్రలో మాత్రమే ఆయన్ని తీసుకున్నారు.

ఆ ఒక్క సినిమాలో తప్ప రాజమౌళి తీసిన మిగితా ఏ సినిమాలో కూడా ప్రకాష్‌ రాజ్‌ లేరు.

ఆయన్ని రాజమౌళి ఎందుకు తీసుకోలేదు అనే డౌట్‌ అందరికీ ఉంది.

ఇదే విషయాన్ని రాజమౌళి గారి దగ్గర అడిగితే ప్రకాష్‌ రాజ్‌ గారు ఇప్పటి వరకు చేయని పాత్ర లేదు..

ఆయన్ని మనం అన్ని పాత్రల్లో చూశాం.ఆయన మళ్ళీ నా సినిమాలో కూడా అదే రకం పాత్ర వేస్తే చూసే జనానికి బోర్‌ కొడుతుంది.

ఆయన ఇంతవరకు చేయని పాత్ర ఏదైనా నా సివిమాలో వచ్చినప్పుడు నేనే ఆయనతో నా సినిమాలో చేయించుకుంటా అని చెప్పారు.