శివ కేశవులకు ఎంతో ప్రియమైనది కార్తీక మాసం

ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమ ధర్మరాజునకూ ప్రియమైన మాసము

చిన్న చిన్న రంద్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు

తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు

ఆకాశదీపారాధన చేసి యమ ధర్మరాజును తమ వైపు రావద్దు అని సూచిస్తున్నట్లుగా వేధాల సారాంశం

ఆకాశ దీపం ఉన్న ఇంటికి లక్ష్మీ నారాయణులు వస్తారని లేని ఇంటికి యమధర్మరాజు వస్తాడని స్కాందపురాణ వాక్యం

 కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు

ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పురాణ కథనం