‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ విజయంతో అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది

ఈ సినిమాలో ‘నాటునాటు’ పాట ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయినా సంగతి తెలిసిందే

ఆస్కార్‌ విజేతల ప్రకటన గడువు దగ్గరపడుతున్ననేపథ్యంలో మంగళవారం ఈ పాట షూటింగ్ వెనక ఉన్న విషయాలు తెలిపారు  రాజమౌళి

‘నాటునాటు పాట ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ నా మదిలో మెదిలేది ఉక్రెయిన్‌లోని లొకేషనే

కీవ్‌లోని అధ్యక్ష రాజభవన ప్రాంగణంలో ఈ పాటని రూపొందించాం. చాలాచోట్ల వెతికి చివరికి ఈ లొకేషన్‌ని ఎంపిక చేశాం

అది అధ్యక్ష భవనం కావడంతో అనుమతి దొరుకుతుందో, లేదో అనే సందేహం ఆ సమయంలోనూ ఉండేది

ఉక్రెయిన్‌ టీం కారణంగా అది సాధ్యమైంది. అందుకు వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి

కళ్లకింపైన రంగులతో ఉన్న విశాలమైన రాజభవనం, డ్యాన్సర్లకు సరిపోయేలా ప్రాంగణం.. నేను కోరుకున్నవన్నీ అక్కడ చక్కగా అమరాయి’ అని జక్కన్న తెలిపారు

కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌కి ‘పాట డ్యాన్స్‌ చూడటానికి బాగుండాలి. కానీ స్టెప్పులు మరీ కష్టంగా ఉండకూడదు. జనం సైతం వాటిని వేసేలా తేలికగా ఉండాలి

హీరోలిద్దరి స్థాయికి తగ్గట్టుగా ఉండాలి’ అని సూచించా. ప్రేమ్‌ వందరకాల వేరియేషన్స్‌తో వచ్చాడు. తెరపై కనపడ్డదానిని చివరికి ఓకే చేశాం’ అని చెప్పారు రాజమౌళి