దైనందిన జీవితంలో కొన్ని లక్ష్యాలను నిర్ధేశించుకోవాలి. దీనికోసం అంకితభావం చాలా అవసరం.
మధుమేహం, గుండె జబ్బులను నివారించడానికి బెల్లీ ఫ్యాట్‌ను తప్పనిసరిగా కరిగించాలి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ సమస్యగానే ఉంటుంది.
ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం చేయండి. శారీరక శ్రమ వల్ల చాలా పొట్ట, పొత్తికడుపులోని కొవ్వు కరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వ్యాయామంతో పాటు పచ్చి కూరగాయలు, పౌష్టికాహారం తీసుకోవాలి.
కండరాలను బలంగా ఉంచడానికి, కొవ్వును కరిగించడానికి ఏరోబిక్ వ్యాయామం మంచిది. క్యాలరీలను తగ్గించడానికి ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేయాలి.
ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. దీనివల్ల బరువును అదుపు చేయడం కష్టమవుతుంది.
దీంతోపాటు రోజూ తగినంత నీరు తాగాలి. అలాగే ఫ్రూట్స్ తినడం, డైట్ అనుసరించడం మంచిది