పోషకాహార లోపంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు

కొన్ని రకాల ఆహారాలను డైట్ లో తీసుకోవడం ద్వారా విటమిన్ల లోపాన్ని అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు

సాధారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి పోషకాహారాలు ఎంతో ఉపయోగపడతాయి

రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో B12 విటమిన్ సహాయపడుతుంది

ఎర్ర రక్త కణాల నిర్మాణం, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదల కోసం విటమిన్ B9 ఉపయోగపడుతుంది

ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల కోసం అవసరమైన కాల్షియంను గ్రహించడానికి శరీరానికి తగినంత విటమిన్ D అవసరం

విటమిన్ B6 నిద్ర, ఆకలి, మానసిక స్థితిని నియంత్రిస్తుంది. రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది

దృష్టి, ఆరోగ్యకరమైన చర్మం, రోగనిరోధక శక్తి పెంచడంలో విటమిన్ A చాలా ముఖ్యమైనది