దంతాలు పసుపు పచ్చగా కావడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ వీటిని తిరిగి తెల్లగా చేయడం కష్టంగా అనిపిస్తుంది చాలా మందికి.
నిజానికి కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ దంతాలు తెల్లగా, ముత్యాల్లా మెరిసిపోతాయి. నిమ్మ తొక్కలు పసుపు పచ్చని దంతాలను తెల్లగా మార్చడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
ఎందుకంటే నిమ్మకాయలో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి మీ దంతాలపై ఉండే పసుపు పచ్చ రంగును వదిలిస్తాయి.
ఇందుకోసం నిమ్మతొక్కలను తీసుకుని దంతాలకు రుద్దండి. లేదా నిమ్మరసాన్ని నీళ్లలో మిక్స్ చేసి దాన్ని నోట్లో పోసి పుక్కిలించండి.
బేకింగ్ సోడా మీ పళ్లను మరింత తెల్లగా చేస్తుంది. ఇందుకోసం బేకింగ్ సోడాను తీసుకుని... దానిలో కొంచెం టూత్‌కలపండి. దీంతోనే రెగ్యులర్ గా బ్రష్ చేసుకోండి.
దీనివల్ల మీ పళ్లపై ఉండే గార ఇట్టే వదులుతుంది. రోజుకు సార్లు దీనిలో బ్రష్ చేస్తే కొన్ని రోజుల్లో మీ దంతాలు తెల్లగా మారిపోతాయి.
అరటి తొక్క ముఖాన్ని అందంగా చేయడమే కాదు.. దంతాలను శుభ్రం చేయడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.
ఇందుకోసం ముందుగా అరటితొక్క ను వొలిచి తొక్క లోపలి భాగాన్ని మీ దంతాలపై బాగా రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో దంతాలను కడిగితే సరి.
తరచుగా ఇలా చేయడం వల్ల మీ దంతాలకున్న పసుపు రంగు పోతుంది.. మెరుస్తాయి.