ఒకరోజంతా మీ ఫోన్‌ ని మర్చిపోయి బయట తిరిగి రండి. ఎంత హాయిగా ఉంటుందో మీరే చూడండి.

గతాన్నీ, భవిష్యత్తునీ వదిలేసి మీ లోపలి పవర్‌ ని బయటకు తీయండి. ప్రతి నిమిషం ఎంజాయ్‌ చేయండి.

క్షమా గుణం అలవరచుకోండి. మీరు గతంలో చేసిన పొరపాట్లకి మిమ్మల్ని మీరు క్షమించుకోండి.

అలాగే ఇంకొకరు మీ విషయంలో చేసిన చిన్న చిన్న తప్పులు మర్చిపోండి. ప్రయోగాలు చేయండి.

కొత్త వంటకం ట్రై చేయడం, ఒక కవిత రాయడం, ఒక బొమ్మ గీయడం,

పెయింటింగ్‌ నేర్చుకోవడం వంటివి మెంటల్‌ హెల్త్‌ కి ఎంతో హెల్ప్‌ చేస్తాయి.

సూర్యోదయాన్ని ఆస్వాదించండి. అలాగే పౌర్ణమి నాటి నిండు చంద్రుణ్ణి, చల్లని వెన్నెలని ఎంజాయ్‌ చేయండి. ఆ ప్రశాంతతే వేరు.

రోజూ కాసేపు నడవండి,నవ్వండి. నడక చెట్ల మధ్య చేస్తే ఇంకా మంచిది, కుదరక పోతే టెర్రస్‌ పైన, ఏదైనా నేచర్‌ కి దగ్గరగా ఉండాలి.

మరొకరు చేసిన సాయానికి మీ కృతజ్ఞతని వారికి తెలపండి. మీ బాధని మీలోనే దాచుకోకండి. మీరు నమ్మే వ్యక్తితో పంచుకోండి.