సనాతన ధర్మం ప్రకారం.. సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యాగం, కలియుగంలో దానధర్మాలు మాత్రమే మనిషిని కాపాడుతాయని చెప్పారు

అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో తోచినంత వరకు దానం చేస్తూ ఉండాలి. అయితే దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి

దానం చేసి ఏది ఆశించకూడదు. అలాగే కొన్ని వస్తువులను జీవితంలో ఎప్పుడు దానం చేయకూడదు. వాటి గురించి తెలుసుకుందాం

స్టీల్ పాత్రలు ఎప్పుడు దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే కుటుంబం ఆనందం దూరమవుతుంది

చెడిన ఆహారాన్ని ఎవరికీ దానం చేయకూడదు. ఇలా చేస్తే మంచిది కాదు

అవసరమైన వారికి కాపీలు, పుస్తకాలు, గ్రంథాలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. కానీ ఇవి చెడిపోకుండా ఉండాలి

కత్తులు, కత్తెరలు, మొదలైన పదునైన వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబ సంతోషానికి, శాంతికి భంగం కలుగుతుంది

చీపురు ఎవరికీ దానం చేయకూడదు. ఒకవేళ దానం చేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది