కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది
రుచిలో చేదుగా ఉంటుంది, కానీ దీనిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరం అవుతాయి
కాకరకాయ మధుమేహ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది
కాకరకాయ తిన్న తర్వాత కొన్ని పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిదికాదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల మలబద్ధకం, నొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు వస్తాయి
చేదు కూరగాయ తిన్న తర్వాత ముల్లంగి లేదా ముల్లంగితో చేసిన వాటిని తింటే గొంతులో సమస్య, అసిడిటీ, కఫం లాంటి సమస్యలు రావొచ్చు
పెరుగును చేదు కూరగాయలతో కలిపి తీసుకుంటే అనేక వ్యాధుల బారిన పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు