ఉరుకులపరుగుల జీవితంలో నెమ్మదిగా భోజనం చేసేందుకు కూడా సమయం ఉండదు

ఎక్కడ పనులు ఆగిపోతాయేమోనని చాలామంది వేగంగా భోజనాన్ని పూర్తి చేస్తుంటారు

ఇలా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు

వేగంగా భోజనం తినడం వల్ల అవసరం అయిన మోతాదు కంటే ఎక్కువ తింటారు. దీనితో బరువు పెరుగుతారు

సరిగా నమలని కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి

కడుపులో ఉబ్బరం వచ్చి క్రమంగా డయాబెటీస్‌ లాంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి

వేగంగా భోజనం తినడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా అనిపిస్తుంది

వేగంగా భోజనం చేయడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి నెమ్మదిగా నమిలి తినాలని వైద్యులు అంటున్నారు