సాధారణంగా మనందరికీ తలనొప్పి ఏదో ఒక కారణంతో రోజూ వస్తూ ఉంటుంది

తలనొప్పి ఎక్కువైనప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పనిచేయడం కుదరదు

ఏ తలనొప్పినైనా పెయిన్‌ కిల్లర్‌తో సరిపెట్టడం ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు

తలస్నానం చేసిన తర్వాత తల తడిగా ఉండడం వల్ల తలనొప్పి వస్తుంది

కాబట్టి తలస్నానం చేసిన ప్రతి సారి తలను సహజంగా వీచే గాలిలో కొద్దిసేపు ఆరబెట్టుకొన్నా సరిపోతుంది

ఖాళీ కడుపుతో ఉండి ఎక్కువగా ఆకలి కలిగినప్పుడు, ఎండలో తిరగడం వల్ల అలసటకు గురైతే అది తలనొప్పికి దారితీస్తుంది

పరిమళభరితమైన సుగంధాలు ఎక్కువ ఘాటుగా ఉండటం చేత తలనొప్పి వస్తుంది

కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది

కాబట్టి గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అప్పుడప్పుడు కను రెప్పలను కదిలిస్తుండాలి

మీరు సరిగా నిద్రపోనట్లైతే, అది మిమ్మల్ని అందవిహీనంగా మార్చడమే కాదు, తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది