వ్యక్తి నుంచి తీసుకున్నా, బ్యాంకు నుంచి తీసుకున్న రుణం భారాన్ని వీలైనంత త్వరగా తొలగించాలని అందరూ కోరుకుంటారు
తీసుకున్న అప్పు తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తీర్చలేరు
అయితే అలాంటి రుణభారం తీర్చడానికి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. కొన్నిసార్లు వాస్తు దోషం వలన కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయి
వాస్తు దోషాలకు కారణమయ్యే తప్పుల గురించి తెలుసుకోండి
మంచం మీద భోజనం చేయడం వల్ల రోగాలు వచ్చి ధన నష్టం వస్తుంది
రాత్రిపూట ఉపయోగించిన పాత్రలను శుభ్రం చేయకుండా అలా వదిలివేయడం కూడా మంచిది కాదు
ఖాళీ నీటి బకెట్‌ను ఎప్పుడూ బాత్రూంలో లేదా వంటగదిలో ఉంచకూడదు. దానిని అలా ఉంచినట్లయితే, దానిని తిప్పండి లేదా ఒక పాత్రతో కప్పండి
చాలామంది తమ ప్రవేశద్వారం వద్ద డస్ట్బిన్లను ఉంచుతారు. ఇది మీకు సౌకర్యవంతంగా ఉండవచ్చు, కానీ వాస్తు కోణంలో మంచిది కాదు