భారత క్రికెటర్ల వింత నమ్మకాలు.. బరిలోకి దిగాలంటే ఇవి ఉండాల్సిందే..

భారత క్రికెటర్లు మైదానంలోకి దిగేటప్పుడు కొన్ని వస్తువులను తమ లక్‌గా భావించేవారు. వాటినే ఫాలో చేస్తూ తమ కెరీర్‌ను కొసాగించారు.

రోహిత్ శర్మ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్‌కు ముందు కచ్చితంగా కాఫీ తాగుతాడంట. అలాగే బ్యాటింగ్ చేయడానికి వచ్చేప్పుడు కుడి పాదానికి ముందు గ్రౌండ్‌లో పెట్టేస్తాడంట.

సచిన్ టెండూల్కర్: దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ ఎప్పుడూ తన ఎడమ పాదానికి ముందుగా ప్యాడ్ ధరిస్తాడంట. అతను దానిని తన అదృష్టంగా భావిస్తుంటాడు.

వీరేంద్ర సెహ్వాగ్: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నంబర్ లేని జెర్సీని ధరించడం తన అదృష్టంగా భావించేవాడు. న్యూమరాలజిస్ట్‌ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. సెహ్వాగ్ గతంలో 44 నంబర్ జెర్సీని ధరించేవాడు.

జహీర్ ఖాన్: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ లక్కీ హ్యాండ్‌ కర్చీఫ్‌ను నమ్ముకునేవాడు. అతను ప్రతీ మ్యాచ్ సమయంలో పసుపు రుమాలు ధరించేవాడు.

రాహుల్ ద్రవిడ్: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ముందుగా థాయ్ ప్యాడ్‌ను కుడి కాలుకు కట్టేవాడు.

సౌరవ్ గంగూలీ: మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కూడా జేబులో గురువు ఫోటో పెట్టుకునేవాడు. అలాగే అతను ఉంగరాలు, దండలు ధరించేవాడు.

మహ్మద్ అజారుద్దీన్: భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎప్పుడూ మెడలో నల్లటి టాలిస్మాన్ ధరించేవాడు. బ్యాటింగ్ చేసేప్పుడు టాలిస్మాన్ అతని జెర్సీకి వేలాడదీసేవాడు.

మొహిందర్ అమర్‌నాథ్: మాజీ వెటరన్ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్‌కు రెడ్ హ్యాండ్‌కర్చీఫ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. మైదానంలో దిగేటప్పుడు ఎప్పుడూ ఎర్రటి రుమాలు జేబులో పెట్టుకునేవాడంట.