మధుమేహం ఉన్నవారు ఎటువంటి సందేహం లేకుండా తినగలిగే పండ్లు

మధుమేహంతో బాధపడేవారు ఎటువంటి పండ్లు తినాలి, ఏవి తినకూడదనే గందరగోళంలో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి పండ్లు తినవచ్చో తెలుసుకుందాం

దానిమ్మ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి తినడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు

ద్రాక్షలో కన్పించే ఫైటో కెమికల్ అయిన రెస్వురాట్రాల్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు దోహదపడుతుంది. ఈ పండ్లు తియ్యగా ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు.

యాపిల్స్, బ్లూ బెర్రీస్ పండ్లు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయి.

జామకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

పుచ్చకాయలో పొటాషియం కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది.రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగకుండా దిగువ భాగంలో ఉంచేందుకు ఈ పండ్లు దోహదపడతాయి.

చెర్రీస్‌లో ఆంథోసైనిన్‌లు ఉంటాయి. ఇవి కణాల ఇన్సులిన్‌ ఉత్పత్తిని 50 శాతం పంపుతాయి. ఇవి తినడం వల్ల మధుమేహం వ్యాధి నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి మంచి ఎంపిక. సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ బొప్పాయిలె ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచడానికి ఈ పండ్లు దోహదపడతాయి.