చాలామంది ప్రజలు ఇంట్లో వంటకాలను పదే పదే వేడి చేసుకుని తింటుంటారు.
రోజుకు రెండు మూడుసార్లు ఆహారాన్ని వేడి చేస్తుంటారు.
అయితే, ఆహార పదార్థాలను రెండుసార్లకు మించి వేడి చేయకూడదు.
తరచుగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు పోతాయి.
అన్నం ఎప్పటికప్పుడు వండుకుని తినడం ఉత్తమం. పదే పదే వేడి చేయకూడదు.
పదే పదే టీ వేడి చేసుకుని తాగొద్దు.
మాంసాహారాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేయొద్దు. అలా చేస్తే అందులోని ప్రోటీన్స్ నాశనం అవుతాయి.