చర్మాన్ని ఆరోగ్యంగా.. ఎంతో అందంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు

కానీ మనం తీసుకునే ఆహారపదార్థాలు.. మన చర్మంపై ప్రభావం చూపిస్తుంది

మనం రోజూ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని తప్పులు చేయడం వలన చర్మ సమస్యలు మరింత పెరుగుతాయి. అవెంటో తెలుసుకుందామా

ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్.. ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్, ప్రాసెస్ట్ ఫుడ్, వైట్ బ్రెడ్ వంటివి ఉంటాయి

ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం వలన మీ గట్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి

దీంతో చర్మం పగుళ్లకు గురవుతుంది. అలాగే చర్మంపై మంట ఏర్పడుతుంది

తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. వీటిని అధికంగా తింటే చర్మానికి హానికరం

తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వలన మీ చర్మంపై రంధ్రాలు మూతపడిపోతాయి. దీంతో చర్మం పై పగుళ్లు ఏర్పడతాయి