గుండె దృఢంగా ఉండాలంటే మన శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని అందరికీ తెలుసు

WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు గుండెపోటే ప్రధాన కారణం. ఇది మానవ రక్త నాళాలలో కొలెస్ట్రాల్ వల్ల ఏర్పడే ఒక అడ్డంకి వల్ల వస్తుంది

కొన్ని పండ్లు, కూరగాయలతో చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. కాబట్టి అటువంటి ఆహారాలు, కూరగాయలు గురించి తెలుసుకుందాం

యాపిల్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఒక యాపిల్ తినాలి

అవోకాడో తినడం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిదిగా చెప్పవచ్చు

గుండె సంబంధిత సమస్యలున్నప్పుడు చాలా మంది పప్పులు తినాలని చెబుతారు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు

పచ్చి కూరగాయలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవు. దాహం లేకున్నా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి

పుచ్చకాయ, దోసకాయ వంటి నీరు శాతం ఎక్కువగా ఉన్న పండ్లని డైట్‌లో చేర్చుకుంటే మంచిది