ఆహార పదార్థాలు పాడవకుండా ఫ్రిజ్‌లో ఉంచడం మంచిదే కానీ కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు
అవేంటో ఎందుకు ఫ్రిజ్‌లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం
బంగాళ దుంపలు ఫ్రిజ్‌లో పెడితే మొలకలు వస్తాయి. వాటిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి
నివేదికల ప్రకారం మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం
చాలామంది వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడుతారు కానీ ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి దెబ్బతింటుంది
తేనె ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే దాని లక్షణాలపై చెడు ప్రభావం చూపుతుంది. తరచుగా ప్రజలు తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతారు ఇది మంచిది కాదు
ప్రజలు అన్ని రకాల నూనెలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ప్రారంభించారు. అయితే చాలా వరకు నూనెను బయట ఉంచడం మంచిది
అరటిపండు చెడిపోకుండా ఉంచడానికి ఫ్రిజ్‌లో పెడుతారు. ఫ్రిజ్ లోంచి బయటకు తీసిన తర్వాత తింటే జలుబు అంటుకుంటుంది