జుట్టు రాలడం, అకాలంగా జుట్టు నెరిసిపోవడం, పొడిబారడం, చివర్లు చిట్లి పోవడం వంటి సమస్యలు చాల మంది ఎదుర్కొంటారు

ప్రస్తుత బిజీ లైఫ్‌లో కాస్త సమయాన్ని వెచ్చిస్తే.. ఈ ఐదు రకాల పూలతో మీ కురులకు మళ్లీ జీవం పోయవచ్చు

పువ్వుల్లోని పోషకాలు జుట్టుకు బలం, ఆరోగ్యం చేకూరుస్తాయి

ముందుగా గులాబీ రేకుల్ని ఎండబెట్టి మొత్తగా గ్రైండ్ చేసుకుని కొన్ని చుక్కల కొబ్బరినూనె, రోజ్‌ వాటర్‌, తేనె కలిపి హెయిర్ ప్యాక్‌లా వేసుకోవచ్చు

జుట్టు రాలడాన్ని నివారించాలంటే 5-6 మందార పువ్వులను గ్రైండ్ చేసుకుని కొంచెం కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు పెట్టుకోవచ్చు

మల్లెపూలకు స్కాల్ప్‌ను తేమగా, శుభ్రంగా ఉంచే లక్షణాలు ఉంటాయి

రోజ్మేరీ పువ్వు నుంచి తీసిన రసం తలకు పట్టిస్తే రక్త ప్రసరణను మెరుగుపరచడంతోపాటు, సహజంగా జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది

బెర్గమోట్‌ పువ్వు జుట్టుకు సహజసిద్ద కండిషనర్‌గా పనిచేయడమేకాకుండా, కురులను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది