ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగడానికి, విజయం సాధించడానికి తెలివిగా, స్మార్ట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు.

విజయానికి సరైన ఆలోచన, కృషి, అంకితభావం అవసరం. ప్రతి వ్యక్తి తనలో ఈ లక్షణాలు ఉండేలా చూసుకోవాలి.

ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇతరులకు చెడు చేసే ప్రవర్తనను ఎప్పుడూ అలవర్చుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దాని నష్టాన్ని మీరు కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

ఏ విషయంలోనైనా.. ఎక్కడైనా.. కొన్ని విషయాలకు దూరంగా ఉంటేనే మంచిది.. కావున ఈ ఐదు తప్పులను అస్సలు చేయకండి..

తెలివిగా ఉండాలనుకుంటే వైఫల్యం, ప్రతికూలతను మీ మనస్సు నుంచి దూరంగా ఉంచండి. దీనివల్ల ఆలోచనలతోపాటు.. ఆరోగ్యం దెబ్బతింటుంది.

సమయం విలువను అర్థం చేసుకోవాలి. తెలివైన వ్యక్తులు సమయం వృధా చేసే తప్పును ఎప్పుడూ చేయరు.

ప్రతిదానికీ ‘యెస్’ అని చెప్పండి. కానీ మనసులోని మాటను బయటపెట్టండి. వర్క్ ప్లేస్‌లో తెలివైన వ్యక్తులు తమ పనిపై మాత్రమే దృష్టి పెడతారు.

ఆత్మవిశ్వాసం స్మార్ట్‌నెస్‌కి పెద్ద సంకేతం. తెలివైన వారు ఎప్పుడూ తమను తాము విశ్వసించి.. ముందుకుసాగాలి.