వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇక్కడ జనాభా కేవలం 800 మాత్రమే.
ఇక్కడ విమానం దిగడానికి ఎక్కువ స్థలం లేదు.ప్రత్యామ్నాయ రవాణా కోసం నది లేదా సముద్రం కూడా లేదు.
ప్రత్యేకంగా కాలినడకన వెళ్లగలిగే కొన్ని దేశాలలో ఇది కూడా ఒకటి.
రైలులో 30 నిమిషాల కంటే తక్కువ దూరంలో ఉన్న ఇతర విమానాశ్రయాలు చుట్టుపక్కల ఉన్న ఇక్కడి ప్రజలు విమాన ప్రయాణానికి ఇబ్బందిపడరు.
ఈ దేశం రోమ్ నగర సరిహద్దుల లోపల ఉంది.
మొనాకో వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోని రెండవ అతి చిన్న దేశం.
ఈ దేశంలో చుట్టూ మూడు వైపులా ఫ్రాన్స్ ఉంది. దీంతో సొంత విమానాశ్రయ సౌకర్యం లేదు.
మొనాకోకు వెళ్లాలనుకుంటే ఫ్రాన్స్‌లోని నైస్ కోట్ డి’అజుర్ విమానాశ్రయంలో దిగిన తర్వాత క్యాబ్‌లోచేరుకోవచ్చు. లేదంటే పడవలో ప్రయాణించాలి.