మీ శరీరంలో ఎక్కడో మంట లేదా లూపస్ వ్యాధి ఉంటే, మీ గోళ్ల రంగు మారవచ్చు. అటువంటి పరిస్థితిలో ఎరుపుగా మారే అవకాశం ఉంది

గోరు రంగు పసుపుగా మారితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. ఇది కాకుండా, థైరాయిడ్, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధిని కూడా సూచిస్తుంది

కొంతమందికి గోళ్లపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నిబట్టి మీ శరీరంలో విటమిన్ బీ, ప్రొటీన్, జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు

రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడంతో గోరులో నలుపు లేదా నీలం మచ్చలు ఏర్పడతాయి

కొంతమంది గుండె జబ్బులు వచ్చిన తర్వాత కూడా గోళ్ల రంగు మారే అవకాశం ఉంది

మీ గోరుపై తెల్లటి చారలు కనిపిస్తే, అది శరీరంలో కిడ్నీ లేదా కాలేయ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు

అంతే కాకుండా గోరులో తెల్లటి గీత ఉండడం కూడా హెపటైటిస్ వంటి వ్యాధికి సంకేతంగా నిలుస్తుంది

చాలా సార్లు గోర్లు బలహీనమైన తర్వాత, అవి విరిగిపోతాయి. దీనితో మీరు శరీరంలోని అనేక వ్యాధుల సంకేతాలను కూడా అర్థం చేసుకోవచ్చు

మీ గోళ్లలో ఈ సమస్య ఉంటే, శరీరంలో రక్తం లేకపోవడం లేదా థైరాయిడ్ వంటి వ్యాధి ఉండే అవకాశం ఉంది