రావణుడు చనిపోయే ముందు మాట్లాడిన మాటలు ఇవే..
"రామా! నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి, నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీ కంటే వయసులో పెద్దవాణ్ణి.
నాకుటుంబం నీ కుటుంబం కన్నాపెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. మీ అంతఃపురమే స్వర్ణం... నా లంకానగరమే స్వర్ణమయం..
నేను బలపరాక్రమాలలో... నీకంటే శ్రేష్టుడిని.ఇన్ని శ్రేష్టమైన విజయాలు కలిగి ఉన్నా..యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఒక్కటే..
నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. నా తమ్ముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు. అందుకే అందరం కలిసి ఉందాం..! విజయాలు సాధిద్దాం.!
కుటుంబాలు విచ్చిన్నం కాకుండా ప్రయత్నిద్దాం! కుటుంబ పరివారం వెంట ఉంటే ఎంతటి కష్టమైన యుద్ధమైనా విజయం వరిస్తుంది.
పరివారమే కుటుంబం అయితే ఆనందం మన వెంటే ఉంటుంది. కుటుంబం దూరమైతే బతుకే భారమవుతుంది.
రావణబ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడంటే.. మనలాంటి వాళ్ల బతుకెంత..?
ఇది కేవలం మాకు ఉన్న సమాచారం ద్వారా , సోషల్ మీడియా వేదికలో మేము సేకరించిన కధనం మాత్రమే.. దేనికి టీవీ9 కు ఎలాంటి సంబంధం లేదు.