చాలా మంది లోదుస్తుల గురించి పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు

లోదుస్తుల పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా తీసుకోకపోతే పలు రకాల సమస్యలను ఎదుర్కొక తప్పదు

ఇన్నర్‌వేర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే  ప్రైవేట్‌ పార్ట్ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లేనని గుర్తించాలి

తడిసిన లోదుస్తువులను ఉపయోగించడం వల్ల ఫంగస్‌, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చికాకు, ఎరుపు దద్దుర్లు వచ్చేప్రమాదం ఉంటుంది

ఇది ఈస్ట్‌ ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది

వీటి కారణంగా మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి

వర్కవుట్స్‌, వాకింగ్, జాగింగ్‌ చేసే వారు వర్కవుట్స్‌ వెంటనే లోదుస్తులను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు

ఎక్కువగా చెమట సమస్యతో బాధపడేవారు రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు లోదుస్తులను మార్చాలని సూచిస్తున్నారు