మన శరీరంలోకి మధుమేహం సమస్య వచ్చిందని, కొన్ని లక్షణాల రూపంలో మనకు తెలుస్తూనే ఉంటుంది.
మెడ కింద చర్మం మందంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో నల్లగా కూడా మారుతుంది. అది కూడా స్కిన్ మొత్తం ఒకేలా స్మూత్‌గా కాకుండా కొన్ని చోట్ల మందంగా మారినట్లు కనిపిస్తుంది.
డయబెటిస్ కారణంగా శృంగారంలో పటుత్వం కూడా తగ్గుతుంది. కారణం రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల పురుషాంగానికి రక్తాన్ని తీసుకెళ్లే నరాలు దెబ్బతింటాయి.
డయాబెటిస్ ఉన్న వాళ్లకు కంటిన్యూస్‌గా దృష్టి లోపం పెరుగుతూ ఉంటుంది.
స్త్రీలలో అయితే పునరుత్పత్తి అవయవం వద్ద లూబ్రికేషన్ తగ్గుతుంది. లైంగిక వాంఛలు కూడా తగ్గుతాయి.
డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా ఉత్సాహంగా కనిపించరు. ప్రతి దానికి చిరాకు పడుతూ ..ముభావంగా ఉంటారు.
మధుమేహం ఉన్న వాళ్లలో తెలియకుండానే బరువు తగ్గిపోతుంటారు.
డయాబెటిస్ వల్ల శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినడంతో బ్లడ్ సర్క్యులేన్‌లో కొంత అవరోధాలు ఏర్పడతాయి. ఫలితంగా చర్మం పొడిబారిపోయి ఒళ్లంతా దురదలు వస్తుంటాయి.