కొందరు ప్రమోషనల్ స్టంట్ అని అంటే, కొందరు శ్రీరాముడి కథ చెప్తున్నప్పుడు ఆంజనేయస్వామి కోసం సీటు వదిలితే తప్పు ఏమిటి? అని కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా చూసే సమయంలో పాటించాల్సిన నియమాలు అంటూ వాట్సాప్ గ్రూప్ లలో తిరుగుతోంది. ఆ నియమాలు ఇవే..

మద్యం తాగి థియేటర్ కి వెళ్ళకూడదు.

పాదరక్షలు వేసుకొని థియేటర్ కి వెళ్ళకూడదు.

మాంసాహారం తిన్న తరువాత థియేటర్ కి వెళ్ళకూడదు.

థియేటర్ బయట, లోపల జై శ్రీరామ్ తప్ప నటుడి పేరు కానీ సినిమాలోని ఇతర పాత్రలకి జేజేలు కొట్టకూడదు.

 వీలయితే మూవీ ప్రదర్శించే స్క్రీన్ ముందు ఇబ్బంది కలగకుండా అందరూ కొబ్బరి కాయలు కొట్టండి.

కుదిరితే టీ షర్ట్ జీన్స్ లాంటివి వేసుకోకుండా పైన తెల్లటి లేదా కాషాయపు బట్టతో కప్పుకొని కింద పంచ కట్టుకొని వెళ్ళాలి.

హనుమంతుడికి కేటాయించిన చైర్ పూలమాలలతో, ధూప, దీప నైవేద్యాలతో అలంకరించండి.

జై శ్రీరామ్  నామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి

ఈ మెసేజ్ ని అసలు ఎవరు పంపడం మొదలుపెట్టారో కానీ ఇది చూసిన వారందరూ కూడా ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.