టమాటా: టమాటాలు తదితర ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
బెర్రీస్: బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీలను నిత్యం తింటూ ఉంటే.. అవి క్యాన్సర్ కణాలతో పోరాడి, వాటిని నాశనం చేస్తాయి.
సిట్రస్ జాతి పండ్లు: ప్రతిరోజూ రెండు కన్నా ఎక్కువ సార్లు సిట్రస్ పండుగానీ, జ్యూస్ గానీ తీసుకున్నవాళ్లలో 'చర్మ క్యాన్సర్' వచ్చే అవకాశాలు 36 శాతం తక్కువగా ఉంటుంది.
వెల్లుల్లి: దీనిలో 'అలిసిన్' అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. నిత్యం 2 నుంచి 5 గ్రాముల వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే క్యాన్సర్ బారినపడకుండా ఉండవచ్చు.
అల్లం: బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిగా అల్లం ఉండేలా చూసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్: పెద్దపేగు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాల నుండి ఆలివ్ ఆయిల్ రక్షణ కల్పించి క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.
పాలు: నిత్యం రెండు గ్లాసులు పాలు తాగితే క్యాన్సర్ నుంచి కొంతలో కొంతైనా ఉపశమనం పొందొచ్చంటున్నారు నిపుణులు.
అవిస గింజలు: ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేసే గుణాలు అవిసె గింజలలో ఉన్నాయి.
చేపలు: క్యాన్సర్ కణాలతో పోరాడగలిగే శక్తి చేపలు తినడం వల్ల లభ్యమవుతుంది.
క్యారెట్: క్యారెట్లను తరచుగా తింటూ ఉంటే.. క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు.