ధుమపానం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని అందరికి తెలిసిందే. కానీ దానిని మాత్రం మానరు

ధూమపానం ఎక్కువ అలవాటు ఉన్నవారికి.. దాన్ని విడిచిపెట్టడం అంత తేలికైన పని కాదు

ధూమపానం మానేసినప్పుడు మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తి సిగరేట్‌ తాగడం మానేస్తే శరీరంలో ఎన్ని మార్పులు ఉంటాయి

సిగరేట్‌ మానేసిన 8 గంటల తర్వాత రక్తంలో నికోటిన్‌ మరియు కార్బన్‌ మోనాక్సైడ్‌ పరిమాణం తగ్గుముఖం పడుతుంది. కానీ సగం వరకు ఇంకా ఉంటుంది

అదే సమయంలో 8 గంటల తర్వాత మీరు సిగరేట్‌ తాగేందుకు చాలా కోరికలు కలుగుతాయి. ఒక సమయంలో 5-10 నిమిషాలు సిగరేట్‌ తాగాలనే కోరిక విపరీతంగా ఉంటుంది

సిగరేట్‌ మానేసిన 12 గంటల తర్వాత శరీరంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. శరీరంలో ఒకమైన మార్పు వస్తుంది. గుండె పని తీరులో మార్పు వస్తుంది

ఒక రోజంతా సిగరేట్‌ లేకుండా బయటకు వెళితే మీరు మెల్లమెల్లగా ధూమపానం మానేసే విధంగా చేసుకోవచ్చు

సిగరేట్‌ మానేసిన తర్వాత మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. సిగరేట్‌ మానేసిన 2 వారాల నుంచి 3 నెలల్లో ఊపిరితిత్తులు బలంగా మారుతాయి