మూవీ కెరీర్‌ను చక్కగా ప్లాన్‌ చేసుకున్న నటీమణుల్లో హన్సిక కూడా ఒకరు

ఈ ముంబాయి బ్యూటీ దక్షిణాదినే ఎక్కువగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది

గ్లామర్‌ పాత్రలే ఎక్కువగా చేసిన ఈ బ్యూటీ ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలతో సరసన నటించింది

కెరీర్‌ బిజీగా ఉండగానే  సోహైల్‌ అనే ముంబైకి చెందిన వ్యాపారవేత్తని  గత సంవత్సరం డిసెంబర్‌ 4వ తేదీన పెళ్లి చేసుకుంది

సోమవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్న హన్సికకు ఎయిర్పోర్టులో ఫాన్స్ పూలమాలలతో స్వాగతం పలికారు

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను చెన్నైలో అడుగుపెట్టగానే పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందని తెలిపింది

2022 సంవత్సరం ఆమెకు చాలా లక్కీ అని.. ప్రస్తుతం ఆమె అంగీకరించిన 7 చిత్రాలు చేతిలో ఉన్నాయని పేర్కొంది

తన వివాహ జీవితం ఆనందంగా సాగుతోందని, నెల రోజులపాటు చెన్నైలోనే ఉండి చిత్రాలను పూర్తి చేస్తానని హన్సిక తెలిపింది