తిరుమలలో భక్తులు రక్తదానం చేస్తే ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
37 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతున్నా.. చాలామందికి తెలియకపోవడం గమానార్హం.
శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూ, ప్రశంసాపత్రం కూడా ఇస్తారు.
రక్తం దానం చేసే దాతలు కొండపై ఉన్న అశ్వినీ హాస్పిటల్‌కు వెళ్లి, రక్తదానం చేయాల్సి ఉంటుంది.
దాతలకు కొన్ని బ్లడ్ టెస్టులు చేసి, రక్తాన్ని సేకరిస్తారు.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాతలు రక్తాన్ని ఇవ్వొచ్చు.
అనంతరం దాతలకు రూ. 300 స్పెషల్ దర్శనానికి అనుమతిస్తారు.