కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న లక్కమ్మ దేవి ఆలయంలో విచిత్ర ఆచారం ఉంది
ఇక్కడ ప్రతి సంవత్సరం చెప్పుల ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పుల దండతో వస్తారు
ప్రతి దీపావళికి ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది. ఆలయం ముందు ఉన్న చెట్టుకు చెప్పుల దండను సమర్పిస్తారు
ఇక్కడి అమ్మవారికి చెప్పుల దండలను సమర్పిస్తే... తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం
ఇక్కడ చెప్పులు సమర్పిస్తే.. పాదాలు, మోకాళ్ల నొప్పి శాశ్వతంగా పోతుందని అంటుంటారు
పూర్వం ఇక్కడి ఆలయంలో ఎద్దులను అమ్మవారి ముందు బలిచ్చేవారట. కానీ కొన్ని కారణాలతో ఈ ఆచారం ఆగిపోయిందట
ఆ తర్వాత ఇక్కడి అమ్మవారికి చెప్పుల దండలను సమర్పించే ఆచారం మొదలైనట్టుగా చెబుతుంటారు
ఇక్కడి అమ్మవారికి శాఖాహారం, మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు