ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా  తెరకెక్కిస్తున్న మూవీ ‘సలార్‌’

హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికిగా నటిస్తుంది

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నారు

ప్రస్తుతం ఈ చిత్రం ముగింపు దశ షూటింగ్ లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకుంది

ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం

మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుందని సమాచారం

ఫిబ్రవరిలో మరో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసి మార్చి నుంచి క్లైమాక్స్‌ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది

విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది